జనసేన బ్యానర్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

73చూసినవారు
పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీని వీడిన తర్వాత జనసేన వైపు బాటలు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గుంటూరు నగరంలో భారీ ఎత్తున జనసేన పోస్టర్లతో వెలిసిన బ్యానర్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కొణిదెల పవన్ నేతృత్వంలో కిలారి వెంకట రోశయ్య అంటూ బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోశయ్య త్వరలో జనసేన తీర్ధం పుచ్చుకోబోతున్నాట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్