పొన్నూరు పట్టణంలోని డ్రైనేజీ , పారిశుధ్యo, సిసి రోడ్ల సమస్యల పై అధికారులతో బుధవారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణ పరిధిలో ప్రధాన డ్రైనేజీ లో పూడికతీతలు పారిశుధ్యం మెరుగుపరచటం వార్డుల్లో అంతర్గత సిసి రోడ్లపై పనులు, తీసుకోవలసిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే చేపట్టే విధంగా అధికారులను ఆదేశించారు.