గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వల్లభరావు పాలెం గ్రామానికి చెందిన బండారుపల్లి సావిత్రి (సాయిమ్మ ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి రాజధాని నిర్మాణానికి తన వంతు సహాయంగా తన రెండు నెలల పెన్షన్ డబ్బులు రూ. 11 వేలు చెక్కు రూపేణా శనివారం గ్రామంలో పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ కు అందజేశారు. వితరణ అందించిన సావిత్రమ్మను ఎమ్మెల్యే ధూళిపాళ్ల అభినందించారు.