పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బుధవారం కుల నిర్మూలన పోరాట సమితి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. ద్రావిడ సమ్మేళన ట్రస్ట్ ఛైర్మన్ ఆకురాతి మురళి పాల్గొని మాట్లాడుతూ ఆనాడు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బహిరంగంగా మనుస్మృతి తగలబెట్టి నేటికీ 97 సం. పూర్తయిన సందర్భంగా అణగారిన వర్గాల విముక్తి పోరాటం కోసం మనుస్మృతి దహనం చేశామన్నారు. ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.