పొన్నూరు: గుండెపోటుతో మామిళ్ళపల్లి గ్రామ సర్పంచి మృతి

67చూసినవారు
పొన్నూరు: గుండెపోటుతో మామిళ్ళపల్లి గ్రామ సర్పంచి మృతి
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామ సర్పంచ్ జాలాది యానాది రావు ( 58) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. మామిళ్ళపల్లి ఎంపీటీసీగా , ప్రస్తుతం సర్పంచ్ గా విధులు నిర్వహిస్తూ గురువారం గుండెపోటుతో హఠాత్ మరణం పొందారు. సర్పంచి జాలాది యానాది రావు మృతికి పొన్నూరు వైయస్సార్సీపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పట్టణ, మండల వైసీపీ నాయకులు సంతాపం తెలిపారు. సర్పంచిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్