కాకుమాను మండలం బోడిపాలెం గ్రామానికి చెందిన వీరయ్య మంగళవారం పొన్నూరు నుండి గుంటూరు వెళుతుండగా పొన్నూరు మండలం మామిళ్ళపల్లి అడ్డరోడ్డు వద్ద గుంటూరు వైపు నుంచి వస్తున్న ఆటో ఢీకొట్టడంతో వీరయ్య కు కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108 వాహనంలో పొన్నూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పొన్నూరు రూరల్ ఎస్సై కిరణ్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.