గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో మంగళవారం గ్రామ రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ రెవెన్యూ సదస్సులో మండల తహసిల్దార్ మహమ్మద్ జియావుల్ హక్, ఎండోమెంట్ , సర్వే అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులో వివిధ భూ సమస్యలపై మొత్తం 59 అర్జీలు అందినట్లు తహసిల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులను ప్రజలు వినియోగించుకోవాలని తహసిల్దార్ కోరారు.