వట్టిచెరుకూరు మండలం కొర్నిపాడు గ్రామంలో సోమవారం రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు, మిద్ది తోట రైతులకు సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిజిపి సిహెచ్ ద్వారక తిరుమలరావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ముఖ్యఅతిదులుగా పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రైతులకు బహుమతులు, సన్మానo చేశారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సభలో డిజిపి పేర్కొన్నారు.