కౌలు గుర్తింపు కార్డులు అందజేసిన ఇంచార్జి కలెక్టర్

71చూసినవారు
కౌలు గుర్తింపు కార్డులు అందజేసిన ఇంచార్జి కలెక్టర్
ప్రభుత్వం అందించే రాయితీలు పొందాలంటే కౌలు రైతులు తప్పనిసరిగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలని బాపట్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ అన్నారు. గురువారం చెరుకుపల్లి తహసిల్దార్ కార్యాలయంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఇంకా కౌలు రైతు గుర్తింపు కార్డులు పొందని వారు రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ సహాయకులను కలసి పత్రాలు అందజేయాలన్నారు. ఆర్డీవో హేల షారోన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్