ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. నగరం మండలంలోని ధూళిపూడి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులకు శుక్రవారం మంత్రి, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, కలెక్టర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. తీరప్రాంత ప్రజల కోసం నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి సంవత్సరం లోపు అన్ని వసతులతో అందుబాటులోకి వస్తుందని మంత్రి చెప్పారు.