మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించకుంటే చర్యలు

63చూసినవారు
మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించకుంటే చర్యలు
మద్దిపాడు మండలం తెల్లబాడు జడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా విద్యాశాఖాధికారి సుభద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుపట్టిక, ఇతర దస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి కోడిగుడ్డు లేకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. సెలవుపై వెళ్లిన ప్రధానోపాధ్యాయుడు గత నెలలో తక్కువ ఇండెంట్ పెట్టారని చెప్పడంతో విద్యార్థుల భోజనం విషయంలో లోటుపాట్లు తలెత్తితే సహించేది లేదన్నారు.

సంబంధిత పోస్ట్