పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా

82చూసినవారు
సత్తెనపల్లి పట్టణంలో గురువారం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వికలాంగులకు పింఛన్లను పంపిణీ చేసి వారి క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం 1వ తేదీన ముఖ్య మంత్రి చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేయడం హర్షణీయం అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్