గృహ నిర్మాణాల లక్ష్యాలను త్వరితగతిన సాధించాలని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం గృహ నిర్మాణ శాఖ పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టిన పక్కాగృహాల నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయని ఆరా తీశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి అధిక సంఖ్యలో పక్కా గృహాలు మంజూరయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు.