సత్తెనపల్లిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఆలయ పూజారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, అష్టోత్తర శతనామావళి తదితర పూజలు అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.