వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి తాడికొండ మండలం శాఖమూరు గ్రామస్తులు తరఫున రూ. 71 వేలు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కు ఆయన కార్యాలయంలో మంగళవారం అందజేశారు. ముఖ్య మంత్రి చంద్రబాబు పిలుపుతో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన వారందరికీ శ్రావణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.