పెన్షన్ రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు పెంచడంతో లబ్ధిదారుల కళ్లలో ఆనందం నెలకొందని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. మంగళవారం తాడికొండ మండలం నిడుముక్కలలో గ్రామ సభ నిర్వహించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెన్షన్ లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.