తెనాలిలో తాళం వేసిన ఇంట్లో చోరీ

60చూసినవారు
తెనాలిలో తాళం వేసిన ఇంట్లో చోరీ
తెనాలి బాలాజీరావుపేటలో నివాసిత కుటుంబం దసరా సెలవుల నేపథ్యంలో రామేశ్వరం వెళ్లారు. శనివారం రాత్రి ఇంటికి వచ్చి చూడగా తలుపులకు వేసిన తాళం పగులగొట్టి ఉంది. లోపల బీరువాలో ఉండాల్సిన సుమారు 6 సవర్ల బంగారు నగలు, కొంత నగదు చోరికి గురైనట్లు గుర్తించి బాధితులు 3టౌన్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. క్లూస్ బృందం వచ్చి ఆధారాలు సేకరించింది. అనంతరం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్