నేడు తెనాలిలో ఐటీఐ అప్రంటీస్ మేళా

73చూసినవారు
నేడు తెనాలిలో ఐటీఐ అప్రంటీస్ మేళా
తెనాలి జగ్గడిగుంటపాలెంలోని ప్రభుత్వ ఐటీఐలో సోమవారం అప్రంటీస్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్ రావి చినవెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకనలో పేర్కొన్నారు. మేళాకు ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ లలో అన్ని ట్రేడ్ లలో శిక్షణ పొంది సర్టిఫికెట్లు ఉన్న విద్యార్థులు బయోడేటా, విద్యార్హత నకలు, ఫొటో, ఆధార్ తో హాజరుకావాలని సూచించారు. 15 కంపెనీల ప్రతి నిధులు విద్యార్థులను ఎంపిక చేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్