తెనాలి పినపాడుకు చెందిన సాయి, లెనిన్లు స్నేహితులు. సాయి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుండగా, లెనిన్ తాపీమేస్త్రి. సాయి దగ్గర లెనిన్ డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి అప్పు చెల్లించే విషయంలో వివాదం చోటుచేసుకుంది. దీంతో మంగళవారం లెనిన్పై సాయి కొడవలితో దాడిచేసి గాయపర్చాడు. గాయపడిన లెనిన్ ను స్థానికులు చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.