తెనాలి: పంచారామాలకు ప్రత్యేక సర్వీసులు

78చూసినవారు
తెనాలి బస్ స్టాండ్ నుంచి పంచారామాలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ ఆదివారం తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా పుణ్యక్షేత్రాలకు నడుపుతున్న బస్సు సౌకర్యాలకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. శ్రీశైలం, అరుణాచలం ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలకు సాధారణ చార్జీలతో బస్సులు నడపనున్నట్లు చెప్పారు. తెనాలి డిపో పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్