భర్త కనిపించడం లేదంటూ భార్య ఫిర్యాదు

74చూసినవారు
భర్త కనిపించడం లేదంటూ భార్య ఫిర్యాదు
ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన భర్త తిరిగి రాలేదంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెనాలి రూరల్ పోలీసులు తెలిపారు. మండలంలోని అంగలకుదురుకు చెందిన కొల్లి విజయ్ కుమార్ ఈ నెల 11న ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. సెల్ ఫోన్ స్విచ్ఎఫ్ రావడంతో బంధువులను తెలిసిన వారిని విచారించినా ఆచూకీ లభించలేదు. దీంతో భార్య లక్ష్మి తిరుపతమ్మ శుక్రవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్