గురు పౌర్ణమి సందర్భంగా అమర్తలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవాలయంలో, ఆలయ ప్రధాన అర్చకుడు స్వర్ణ వెంకట శ్రీనివాస శర్మ ను ఆదివారం ఆయన శిష్య బృందం, భక్తులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. గురు పూర్ణమి - వ్యాస పూర్ణమి కూడా కావడంతో ఆయనకు గురు సత్కారం నిర్వహించినట్లు శిష్యులు కొండపల్లి సత్యనారాయణ, చావలి శ్రీధర్ శర్మ, తెలిపారు.