ఈ నెల 31న విజయవాడ గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో ప్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబా సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు పిడిఎం రాష్ట్ర కార్యదర్శి కె. వెంకటేష్, రాష్ట్ర సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం చిలకలూరిపేట, బాపట్ల జిల్లా, మార్టూరులో సంబంధిత కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సభకు కవులు, కళాకారులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.