భట్టిప్రోలు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామం ఉత్తరం వైపున ఉన్న మాగాణి భూములకు పంట నీరు వచ్చేందుకు కాలువ పూడిక తీయించాలని రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ లో తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. రైతు సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు వేములపల్లి వెంకట రామయ్య మాట్లాడుతూ వెల్లటూరు, వెల్లటూరు గ్రామం ఉత్తరం వైపున సుమారుగా 100 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందించే పంట కాలువ పూడిపోయిందన్నారు.