బొల్లాపల్లి మండలంలో అకాల వర్షానికి పలు పంటలు నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి పలు పంటలు నష్టపోయాయి. వర్షం దాటికి పోగాకు పంటలు వాలిపోయాయి. కల్లాల్లో ఉన్న మిర్చి పంట తడిసి పోయింది. కోసిన వరి పంట నీటమునిగాయి. మరికొన్ని గ్రామాల్లో వరి పనలు వర్షం దాటికి కోట్టుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.