వినుకొండ నియోజకవర్గంలోని రూరల్ పరిధిలో వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు తప్పనిసరిగా పోలీసు ల నుండి అనుమతి తీసుకోవాలని రూరల్ సీఐ ప్రభాకర్ తెలిపారు. ఏ రోజు విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారో ముందుగానే ఆ తేదీని తెలపాలన్నారు. డీజేలకు ఎటువంటి అనుమతి లేదని విగ్రహం వద్ద సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.