భారత్ బంద్‌లో భాగంగా హోటల్ మూసేయాలన్న యువకుడిపై యజమాని కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బందంచెర్లలో బుధవారం చోటు చేసుకుంది. హోటల్ బంద్ చేయాలని పవన్ అనే యువకుడు ఓ హోటల్ యజమానికి చెప్పాడు. దాంతో ఆ హోటల్ యజమాని కత్తితో పవన్‌పై దాడి చేశాడు. గాయపడిన పవన్‌ను స్థానికులు చింతలపూడి ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.