ఏపీలో వరద బాధితుల సహాయార్థం భారత్ బయోటెక్ సంస్థ విరాళం ప్రకటించింది. ఏపీ సీఎం సహాయ నిధికి రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈమేరకు బ్యాంకు ఖాతాకు నగదును పంపించినట్లు యాజమాన్యం ప్రకటించింది. తమ సాయం వరద బాధితులను ఆదుకునేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి రావాలని కోరుకున్నారు.