టీటీడీపై భూమన అసత్య ప్రచారం: హోంమంత్రి అనిత

83చూసినవారు
టీటీడీపై భూమన అసత్య ప్రచారం: హోంమంత్రి అనిత
AP: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అసత్య ప్రచారాలతో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. గోశాలలో 260 మంది సిబ్బంది గోసంరక్షణ పనులు చేస్తున్నారని, సుమారు 2,668 ఆవులకు జియో ట్యాగ్ చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్