పిల్లలో పౌష్టికాహార లోపానికి అనేక కారణాలున్నాయి. బాల్య వివాహాలు, పేదరికం, అనార్యోగంతో అవగాహన లేమితోనే సమస్య నెలకొంటోంది. చిన్న వయసులో గర్భం దాల్చడంతో నెలలు నిండకుండానే ప్రసవిస్తున్నారు. ఇలా జన్మించే పిల్లలకు అనేక రుగ్మతలు ప్రబలుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూలీ చేసేవాళ్లు ఎక్కువగా ఉంటారు. వారు పేదరికం, ఇతర కారణాలతో చిన్నారులకు పౌషకాహారం అందించలేక పోతున్నారు.