TG: బిల్లులపై నిర్ణయానికి రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు విధించినట్లుగానే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్‌లకు డెడ్‌లైన్ విధించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పాలనలో అడ్డంకులు సృష్టించేందుకు బీజేపీ, కాంగ్రెస్ లెక్కలేనన్న సార్లు గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేశాయని కేటీఆర్ ఆరోపించారు.