రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జామ్వా రామ్‌గఢ్ జిల్లా మనోహర్‌పూర్-దౌసా జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 నెలల శిశువు, ఇద్దరు మహిళలతో సహా ఐదుగురు స్పాట్ లోనే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.