AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌కు ఆయన లేఖ రాశారు. కొత్త సిలబస్ దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాలని కోరారు. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల ఇబ్బందులను లేఖలో వివరించారు. కాగా జూలై 28వ తేదీన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించిన సంగతి తెలిసిందే.