ఏపీ మంత్రులకు బిగ్ షాక్

29889చూసినవారు
ఏపీ మంత్రులకు బిగ్ షాక్
ఎన్నికల ఫలితాలకు ముందు ఏపీ మంత్రులకు బిగ్ షాక్ తగిలింది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని ఆయా కార్యాలయాల సిబ్బందిని సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) ఆదేశించింది. సీఎంగా జగన్ పదవీకాలం ముగియనుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. తమ అనుమతి లేకుండా సచివాలయం నుంచి చిన్న వస్తువు కూడా తరలించొద్దని తేల్చి చెప్పింది. మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని, ఆలోగా ఖాళీ అవ్వాలని జీఏడీ తెలిపింది.

సంబంధిత పోస్ట్