విజయవాడలో వైసీపీకి షాక్ తగిలింది. ముగ్గురు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కేశినేని శివనాథ్, బొండా ఉమ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో కార్పొరేటర్లు లావణ్య, హర్షద్, రత్న కుమారి ఉన్నారు. విజయవాడ అభివృద్ధి కోరుతూ పార్టీలో చేరుతున్నట్లు కార్పొరేటర్లు తెలిపారు.