AP: సూపర్ సిక్స్ అమల్లో భాగంగా తల్లికి వందనం (ప్రతి ఏడాది రూ. 15,000) పథకంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి పిల్లల తల్లులకు ఈ పథకం ద్వారా తమ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుందని మంత్రి ప్రకటించారు. ఇందులో భాగంగానే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించామని, త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు.