ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై యజమాని ప్రమేయం లేకుండా సభ్యులు EPF ఖాతా బదిలీకి దరఖాస్తు చేసుకునేలా కేంద్రం సేవలను ప్రారంభించింది. 2017 అక్టోబర్ 1 తర్వాత UAN జారీతో పాటు ఈ-కేవైసీ, ఆధార్ లింక్ పూర్తయినవారికే ఇది వర్తించనుంది. దీంతో వ్యక్తిగత వివరాల్లో తప్పుల సవరణ సభ్యులే స్వయంగా చేసుకోవచ్చు. ఆధార్ లింక్ చేయనివారికి యజమాని ధ్రువీకరణ తప్పనిసరి.