ఏపీలో హీటెక్కిన రాజకీయం.. ప్రచారం షురూ చేసిన బీజేపీ

76చూసినవారు
ఏపీలో హీటెక్కిన రాజకీయం.. ప్రచారం షురూ చేసిన బీజేపీ
ఏపీలో రాజకీయాలు కాక రేపుతున్నాయి. వైసీపీ, టీడీపీ పర్యటనలు, బహిరంగ సభలు నిర్వహిస్తుండగా బీజేపీ కూడా ప్రచారం షురూ చేసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నేడు బీజేపీ ప్రచారం ప్రారంభించింది.. టిక్కెట్ ఆశిస్తూ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి విష్ణుకుమార్ రాజు ప్రచారం మొదలుపెట్టారు. మంచి ముహూర్తం ఉండటంతో ప్రచారం మొదలు పెట్టినట్లు విష్ణు తెలిపారు. కాగా, ఈ ఎన్నికల ప్రచారంలో ఎంపీ జీవీఎల్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్