దీపం-2 పథకంలో 80.37 లక్షల సిలిండర్ల బుకింగ్‌

61చూసినవారు
దీపం-2 పథకంలో 80.37 లక్షల సిలిండర్ల బుకింగ్‌
AP: దీపం-2 పథకంలో 80.37 లక్షల ఉచిత సిలిండర్లు బుక్‌ చేసుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఇందులో 62.30 లక్షల సిలిండర్లు డెలివరీ చేశామని, వారి ఖాతాల్లో రూ.463.82 కోట్లు జమ చేశామని వివరించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బుక్ చేసుకున్న వెంటనే పట్టణ ప్రాంతాల్లో 24 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో సిలిండర్ డెలివరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం 48 గంటల్లో రాయితీ సొమ్ము జమ చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్