వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో శాసన మండలి ఛైర్మన్ మోషేనురాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం బొత్స మాట్లాడుతూ.. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. అయితే తప్పుడు కేసులు పెట్టడం మాత్రం సరికాదని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఎన్ని ఎంక్వైరీలు చేసుకున్నా తాము భయపడమని తెలిపారు. ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇతరులపై బురద జల్లే వైఖరి తమది కాదని అన్నారు.