విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం ఎన్జీవోస్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు షూ లేస్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడవద్దు, హర్రర్ వీడియోలు చూడవద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపంతో బాలుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.