TG: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సోమారం తండాకు చెందిన గుగులోతు సురేఖ అనే యువతి ఆదివారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గాంధీ ఆసుపత్రిలో ఈరోజు సురేఖ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. కాగా హైదరాబాద్ అశోక్ నగర్ లో సురేఖ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడంపై నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. సురేఖ ఆత్మహత్యపై వాస్తవాలను పోలీసులు వెల్లడించాలని, సూసైడ్ నోట్ బయటపెట్టాని డిమాండ్ చేశారు.