విశాఖలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్‌లో విషాదం చోటుచేసుకుంది. వాటర్ వరల్డ్‌లో స్విమ్మింగ్‌కు దిగి రిషి (7) అనే బాలుడు మృతి చెందాడు. బాలుడు స్పృహ లేకుండా పడిపోవడంతో స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యలు తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుడి మృతికి స్పోర్ట్స్ క్లబ్ సిబ్బందే కారణమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.