ఇవాళ సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి బ్రేకులు పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఆదివారం పల్నాడు జిల్లాలోని రేపల్లె, మాచర్ల, మచిలీపట్నం నియోజకవర్గాల్లో రోడ్ షోలను నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రచారానికి విరామం ఇచ్చారు. పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, పార్టీ ముఖ్యనేతలతో నేడు సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోల్ మేనేజ్‌మెంట్‌పై సీఎం జగన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.