గాజాపై దాడి చేసి హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ ను ఇజ్రాయెల్ హతమార్చింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. కాగా గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై జరిగిన దాడికి 'సూత్రధారి సిన్వార్' అని నివేదికలు తెలిపాయి. 2024 జూలైలో ఇరాన్ లో ఇస్మాయిల్ హనియే మరణం తర్వాత సిన్వార్ హమాస్ చీఫ్ గా మారాడు. ఈ దాడుల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది.