తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన కంటిన్యూ అవుతోంది. భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలపైనే రికార్డ్ కావడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉష్ణోగ్రతలతోపాటు వేడి గాలులు కూడా తీవ్రంగా పెరిగాయని... మరో మూడు, నాలుగు రోజులపాటు ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.