పాదచారులపైకి దూసుకెళ్లిన కారు.. షాకింగ్ వీడియో

59చూసినవారు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఓ మహిళ, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ, ఆమె కుమారుడు, భర్త కలిసి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. అకస్మాత్తుగా అతివేగంతో వచ్చిన కారు వెనుక నుంచి కొడుకు, తల్లిని ఢీకొట్టింది. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్