AP: వాలంటీర్లు నేటి నుంచి మూడు రోజులపాటు నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆందోళనకు దిగనున్నారు. నిరసన కార్యక్రమాలలో భాగంగా నేడు గ్రామ, వార్డు సచివాలయం అడ్మిన్లకు వాలంటీర్లు వినతిపత్రాలను అందజేయనున్నారు. రేపు జిల్లా కేంద్రాల్లో మోకాళ్ల మీద కూర్చొని బిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.