AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధ, గురు వారాల్లో నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.