గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు చేపట్టవద్దని గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఈ నెల 28 వరకు కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.